తెలంగాణ

telangana

ETV Bharat / sitara

శంకర్​- చెర్రీ కాంబో సినిమా ఈ జోనర్​లోనే రానుందా? - సైన్స్​ఫిక్షన్​ శంకర్​ చెర్రీ సినిమా

రామ్​చరణ్​-శంకర్​ కాంబోలో తెరకెక్కబోయే సినిమా సైన్స్​ఫిక్షన్​ జోనర్​లో రాబోతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతకుముందు శంకర్ తన తర్వాతి సినిమా సైన్స్​ఫిక్షన్​ నేపథ్యంలో తెరకెక్కిస్తానని అనడమే ఇందుకు కారణం.

ram
రామ్​

By

Published : Feb 16, 2021, 7:02 PM IST

Updated : Feb 16, 2021, 7:14 PM IST

హీరో రామ్‌చ‌ర‌ణ్‌-స్టార్ దర్శకుడు శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నుంది. ఇటీవల ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే వీరిద్దరి క్రేజీ కాంబోలో సినిమా అన‌గానే.. అభిమానుల్లో భారీగా ఆసక్తి నెలకొంది. వైవిధ్యంగా సినిమాలను తెరకెక్కించే శంక‌ర్ ఈ సారి చరణ్​తో ఏ జోన‌ర్​లో చిత్రాన్నిచేస్తారనే విషయమై సినీప్రేక్షకుల్లో చర్చలు మొదలయ్యాయి.

అయితే.. శంక‌ర్ చాలా రోజుల క్రిత‌మే తాను ప్రస్తుతం తెరకెక్కిస్తోన్న 'భారతీయుడు 2' చిత్రం త‌ర్వాత చేయ‌బోయే సినిమా జోన‌ర్ గురించి చెప్పారు. సైన్స్​ఫిక్షన్​ కథాంశంతో తెరకెక్కిస్తానని వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట వైరల్​ అయింది. ఈ నేపథ్యంలో చెర్రీతో తీయబోయే సినిమా సైన్స్ ఫిక్ష‌న్ అయి ఉంటుందని భావిస్తున్నారంతా. ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్ 'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. సినిమా షూటింగ్ తుదిదశకు చేరుకుంది. ఈ చిత్రం త‌ర్వాతే శంక‌ర్-చెర్రీ సినిమా పట్టాలెక్కనుంది.

Last Updated : Feb 16, 2021, 7:14 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details