తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రభాస్​కు ఒక్కో సినిమా కోసం రూ.100 కోట్లు! - ప్రభాస్ రాధేశ్యామ్

పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్, తన రెమ్యునరేషన్​ భారీగా పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ దాని సంగతి ఏంటి?

Is Prabhas charging Rs 100 crore per film?
ప్రభాస్​కు ఒక్కో సినిమా కోసం రూ.100 కోట్లు!

By

Published : Apr 2, 2021, 5:31 AM IST

డార్లింగ్ ప్రభాస్.. ప్రస్తుతం ఏకకాలంలో నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే 'బాహుబలి' సిరీస్​తో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన అతడు.. రెమ్యునరేషన్​ భారీగా పెంచినట్లు సమాచారం.

ఒక్క సినిమాకు రూ.100 కోట్లు?

మన దేశంలో ఓ సినిమాకు రూ.100 కోట్ల రెమ్యునరేషన్​ తీసుకుని, అందుకు న్యాయం చేయగల ఒకే ఒక్క నటుడు ప్రభాస్ అని, తన సినిమాల ద్వారా నిర్మాతలకు చాలా డబ్బులు తీసుకొచ్చే సత్తా అతడికి ఉందని ప్రభాస్ సన్నిహితుల్లో ఒకరు చెప్పారు.

రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్

ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న 'రాధేశ్యామ్'.. ఈ ఏడాది జులై 30న థియేటర్లలో విడుదల కానుంది. మరోవైపు 'కేజీఎఫ్' ప్రశాంత్​ నీల్​తో సలార్, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్​తో 'ఆదిపురుష్' చేస్తున్న డార్లింగ్.. నాగ్ అశ్విన్ డైరెక్షన్​లో మరో సినిమా చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details