హీరో రామ్‌చరణ్‌తో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్న దర్శకుడు మోహన్‌రాజాకు చిరంజీవి కొత్త బాధ్యతల్ని అప్పజెప్పారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. చిరుతో 'లూసిఫర్' రీమేక్ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం ఈయనకే లభించినట్టు సమాచారం. మలయాళంలో విజయవంతమైన 'లూసిఫర్' రీమేక్ హక్కుల్ని చరణ్ ఇప్పటికే సొంతం చేసుకున్నారు. ఆ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సుజీత్, వి.వి.వినాయక్ తదితర పేర్లు పరిశీలించినా సరే ఏదీ కుదరలేదు. ఇప్పుడు ఆ బాధ్యతను మోహన్‌రాజా తీసుకున్నారట.
చిరంజీవి కోసం తమిళ స్టార్ డైరెక్టర్! - చిరంజీవి మోహన్‌రాజా
మెగాస్టార్ చిరంజీవి 'లూసిఫర్' రీమేక్ దర్శకత్వ బాధ్యతల్ని మోహన్‌రాజాకు అప్పగించినట్లు సమాచారం. ఈ దర్శకుడు రామ్చరణ్తోనూ ఓ సినిమా తీసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగు, తమిళ భాషల్లో విజయవంతమైన చిత్రాలు చేశారు మోహన్. రామ్‌చరణ్‌కు విజయాన్ని అందించిన ‘ధృవ’ మాతృక 'తని ఒరువన్' తీసింది ఈయనే. తన కథలో చక్కగా ఒదిగిపోయిన రామ్‌చరణ్‌తో నేరుగా ఓ సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతలో 'లూసిఫర్' రీమేక్ అవకాశం ఆయన్ని వరించినట్టు సమాచారం. చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తయ్యాక 'లూసిఫర్' రీమేక్ ప్రారంభం కానుంది. ఈ సినిమా తర్వాత చరణ్ - మోహన్‌రాజా కలయికలో సినిమా రూపొందే అవకాశాలున్నాయి.
ఇదీ చూడండి : కేఎఫ్‌సీ చికెన్‌తో అదరగొట్టిన మెగాస్టార్