ప్రముఖ దర్శకుడు మణిరత్నం పత్రిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'పొన్నియన్ సెల్వన్'. గతేడాది డిసెంబర్‌లో థాయ్‌లాండ్‌లో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ఆ తర్వాత రెండో షెడ్యూల్ పుదుచ్చేరిలో ఫిబ్రవరి 3 నుంచి ఆరు రోజుల పాటు చిత్రీకరణ ప్రారంభించారు. అనంతరం లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే తాజాగా దర్శకుడు మణిరత్నం.. ఐశ్వర్యా రాయ్, విక్రమ్‌ల కాల్‌షీట్లను ఎక్కువ మొత్తం తీసుకొని పుదుచ్చేరిలో షూటింగ్ ప్రారంభించడానికి సమాయత్తం అవుతున్నట్లు టాక్.
ప్రస్తుతం లాక్‌డౌన్ పూర్తయినా అవుట్ డోర్ షూటింగ్ అంటే అనుమతులు ఇస్తారో లేదో తెలియదు. ఈ పరిస్థితులన్నీ గమనించిన చిత్రబృందం చైన్నైలోనే వీరిద్దరితో ఇండోర్ షూటింగ్ చేయాలని భావిస్తుందట. అందుకోసం సినిమా చిత్రీకరణ పునఃప్రారంభంకాగానే ఐష్-విక్రమ్ సన్నివేశాలు త్వరగా పూర్తిచేయాలని వారి కాల్‌షీట్లను ఎక్కువగా తీసుకున్నట్లు తెలుస్తోంది.