'పవన్ 28' చిత్రం సంబంధించిన విశేషాలంటూ నెట్టింట కొన్ని వైరల్ అవుతున్నాయి. పవన్ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కించబోయే చిత్రమే 'పవన్ 28' (వర్కింగ్ టైటిల్). మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇటీవలే సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌ని తీసుకున్నట్లు ప్రకటించారు దర్శకుడు హరీశ్. మ్యూజిక్ డైరెక్టర్‌పై స్పష్టత రావడం వల్ల.. హీరోయిన్ కోసం చర్చలు ప్రారంభించారు.
'గబ్బర్‌సింగ్' పక్కన ఛాన్స్ కొట్టేసిన మలయాళీ భామ! - pawan 28
పవర్‌స్టార్, హరీశ్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రంలో పవన్‌కు జోడీని వెతికిన మాట నిజమే కానీ ఎంపిక చేసింది మాత్రం చిత్ర బృందం కాదండోయ్. మరి ఇంకెవరు అంటారా?... నెటిజన్లు, సినీ అభిమానులు. సామాజిక మాధ్యమాల వాడుక విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఏది నిజమో, ఏది అబద్ధమో? తెలియడం లేదు. తాజాగా పవన్ చిత్రంలో కథానాయికగా మలయాళీ భామ ఎంపికైనట్లు సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తోంది.
'గబ్బర్‌సింగ్'కు జోడిగా మలయాళీ భామ!
మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన నాయిక మానస రాధాకృష్ణన్ 'పవన్ 28'లో నటిస్తుందంటూ చెప్పుకొస్తున్నారు. బాలనటిగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన మానస.. లఘు చిత్రంలోనూ నటించింది. ఓ తమిళ సినిమాలోనూ కనిపించింది. ఏది ఏమైనా ఈ అమ్మడు ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి పవన్‌తో నటించే విషయంలో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.
ఇదీ చూడండి.. విజయ్ను లైన్లో పెట్టిన లారెన్స్!