తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మహాభారతంలో కృష్ణుడు-ద్రౌపదిగా నటించేది వీళ్లేనా? - ద్రౌపది

మహాభారతం, రామయాణం లాంటి ఇతిహాసాలను తెరపైకి తీసుకురావాలని చిత్ర నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా మహాభారతం ఆధారంగా తీయనున్న సినిమాలో బాలీవుడ్ స్టార్ల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

Is Hrithik Roshan and Deepika Padukone will lead roles in MAHABARATHA..?
హృతిక్ - దీపిక

By

Published : Dec 24, 2019, 9:12 PM IST

మహాభారతం అంటే మనకు ముందుగా గుర్తొచ్చే పాత్రలు కృష్ణుడు, ద్రౌపది. ఈ పాత్రల్లో హృతిక్‌ రోషన్, దీపిక పదుకుణె నటిస్టున్నారట. ప్రస్తుతం బాలీవుడ్​లో ఈ వార్త బలంగా వినిపిస్తోంది.

మహాభారతాన్ని కూడా రెండు భాగాలు తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నట్లు బాలీవుడ్​ సినీ వర్గాల్లో ఊహాగానాలు వస్తున్నాయి.ఇప్పటికే నితీష్‌ తివారి దర్శకత్వంలో రామాయాణాన్ని మూడు భాగాలు విభజించి సినిమాగా తీయాలనుకున్న సంగతి తెలిసిందే.
రామాయణ, మహాభారతాలను చిత్రాలు నిర్మించేందుకు ప్రముఖ వ్యాపారవేత్త మధు మంతెన నిర్మించనున్నట్లు తెలుస్తోంది. మహాభారతం మొదటి భాగాన్ని 2021 దీపావళి పండుగ నాటికి తెరపైకి తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details