పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్'(bheemla nayak release date) చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల రిలీజైన టైటిల్సాంగ్ రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. అయితే.. ఈ సినిమా సంక్రాంతి బరినుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24, లేదా 25న ఈ చిత్రం '(bheemla nayak release date) థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తుదిదశకు చేరుకుంది.
మలయాళ హిట్ 'అయ్యప్పనుమ్ కోశియమ్'కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. అతడిని ఢీ కొట్టే పాత్రలో రానా కనిపించనున్నారు. నిత్యామేనన్, సంయుక్త.. కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.