నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బి.గోపాల్ కాంబినేషన్లో గతంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వాటికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మళ్లీ ఇప్పుడు అదే స్థాయిలో అభిమానుల్ని అలరించేందుకు వారు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కథ సిద్ధం చేసిన గోపాల్.. ప్రముఖ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్‌కు స్క్రిప్టు బాధ్యతను అప్పజెప్పారని సమాచారం. స్క్రిప్టును బాలయ్యకు వినిపించడమే మిగిలి ఉందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
'రూలర్' తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి మూడోసారి పనిచేస్తున్నాడు బాలకృష్ణ. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమై తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కరోనా కారణంగా చిత్రీకరణను నిలిపివేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన అనంతరం బి.గోపాల్ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందట.