మాజీ ప్రపంచ సుందరి, హీరోయిన్ ఐశ్వర్యరాయ్.. మరోసారి తల్లి కాబోతుందా? అనే సందేహం నెటిజన్లకు వచ్చింది. ఆమె భర్త, హీరో అభిషేక్ బచ్చన్ చేసిన ట్వీట్ ఇందుకు కారణమైంది. "త్వరలో మీకు ఓ సర్ప్రైజ్ ఇస్తున్నా" అని ఈ ట్వీట్లో ఉంది.
దీనిపై స్పందించిన నెటిజన్లు.. వివిధ కామెంట్లు పెడుతున్నారు. "మీరు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారా?", "మీ కూతురికి తమ్ముడు/చెల్లి రాబోతున్నారా?", "మరో జూనియర్ బచ్చన్ రాబోతున్నాడా?" అని రాసుకొచ్చారు.
కూతురు ఆరాధ్యతో ఐశ్వర్యరాయ్
ఓ నెటిజన్ మాత్రం విభిన్నంగా అడిగాడు. మీరు(అభిషేక్) బాలీవుడ్ నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నారా? లేదా 'ధూమ్ -5' సినిమా గురించి ఏమైనా చెప్పబోతున్నారా? అని అన్నాడు. మీరు కౌన్ బనేగా కరోడ్‌పతి తర్వాతి సీజన్‌కు వ్యాఖ్యతగా వ్యవహరించనున్నారా? నాన్న(అమితాబ్) ఆరోగ్యం ఎలా ఉంది? అంటూ కామెంట్ పెట్టాడు మరొకరు.
అభిషేక్ బచ్చన్ కొత్త సినిమా 'బాబ్ బిశ్వాస్' షూటింగ్.. ఈ శుక్రవారం కోల్‌కతాలో మొదలైంది. బాద్షా షారుక్ ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
ఇది చదవండి: మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం నాన్నా.. ఐశ్వర్య భావోద్వేగం