తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇర్ఫాన్ ఖాన్ 'అంగ్రేజీ మీడియం' ప్రారంభం - angreji medium

క్యాన్సర్ నుంచి కోలుకుని మళ్లీ సినిమా చేస్తున్నాడు బాలీవుడ్ హీరో ఇర్ఫాన్ ఖాన్. చిత్ర షూటింగ్ ఈ రోజు ప్రారంభమైంది.

అంగ్రేజీ మీడియం చిత్రబృందం

By

Published : Apr 5, 2019, 3:17 PM IST

ఇర్ఫాన్ ఖాన్.. తన అద్భుతమైన నటనతో జాతీయ అవార్డు గెలుచుకున్న హీరో. హాలీవుడ్​లోనూ మెరిశాడు. అలాంటి నటుడు ఒక్కసారిగా న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్​తో బాధపడుతున్నానని ప్రకటించాడు. అభిమానులంతా ఆయన తొందరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రస్తుతం క్యాన్సర్​​ను దిగ్విజయంగా జయించి సినిమాల్లోకి పునరాగమనం చేస్తున్నాడు.

2017లో ఇర్ఫాన్ నటించిన 'హిందీ మీడియం' చిత్రానికి సీక్వెల్ చేస్తున్నాడీ హీరో. 'అంగ్రేజీ మీడియం'గా తెరకెక్కనున్న ఈ సినిమాకు హోమీ అదజానియా దర్శకత్వం వహిస్తున్నాడు.

2018 మార్చి 5న తన ఆరోగ్య సమస్య గురించి అభిమానులకు తెలిపాడు ఇర్ఫాన్. రెండు రోజుల క్రితం వ్యాధి నయం అయిందని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పాడు.

ఇవీ చూడండి.. రష్మికకు విషెస్​ కాస్త డిఫరెంట్​గా..

ABOUT THE AUTHOR

...view details