బాలీవుడ్ దిగ్గజ నటులు రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్లకు ఘనంగా నివాళులర్పించింది బ్రిటీష్ అకాడమీ ఫర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టా). ఆదివారం రాత్రి జరిగిన ఈ వేడుకల్లో వారితో పాటు సీన్ కానరీ, కిర్క్ డగ్లస్, చడ్విక్ బోస్మన్, ఇంకా ఇటీవల సినీ ప్రపంచం కోల్పోయిన 40 వేల మంది కళాకారుల సేవల్ని గుర్తు చేసుకున్నారు.
ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్‌కు బాఫ్టా నివాళులు - రిషి కపూర్‌కు బాఫ్టా సంతాపం
బాఫ్టా వేడుకల్లో బాలీవుడ్ నటులు రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్లకు నివాళులర్పించారు. వీరితో పాటు ఇటీవల సినీ ప్రపంచం కోల్పోయిన కళాకారుల సేవల్ని గుర్తుచేసుకున్నారు.
రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్
ఈ వేడుకల్లో ప్రియంకా చోప్రా, ఆమె భర్త నికో జోనస్‌తో కలిసి సందడి చేసింది. 74వ బాఫ్టా అవార్డుల వేడుక వర్చువల్‌గా లండన్‌లో జరుగుతోంది. రెండు రోజుల పాటే సాగే ఈవెంట్లో భాగంగా తొలిరోజు ఎనిమిది కేటగిరీల్లో అవార్డులను ప్రకటించారు. ఇందులో 'మా రైనీస్ బ్లాక్ బాటమ్' సినిమా రెండు పురస్కారాలను అందుకుంది.