తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇర్ఫాన్​ఖాన్ అంత్యక్రియల్లో ఐదుగురు మాత్రమే - ఇర్ఫాన్ ఖాన్ తాజా వార్తలు

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్​ఖాన్​కు ముంబయిలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. లాక్​డౌన్ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి అతడి కుటుంబ సభ్యులు మినహా కేవలం ఐదుగురు మాత్రమే హాజరయ్యారు.

కేవలం ఐదుగురి సమక్షంలో ఇర్ఫాన్​ అంత్యక్రియలు
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్

By

Published : Apr 29, 2020, 6:45 PM IST

క్యాన్సర్​తో పోరాడుతూ నేడు తుదిశ్వాస విడిచిన బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో, ముంబయిలోని వెర్సోవా కబ్రిస్థాన్​లో అతడి పార్థివదేహాన్ని ఖననం చేశారు. కుమారులు బాబిల్, అయాన్.. తండ్రి చివరి కార్యక్రమాలు చేశారు. కుటుంబ సభ్యులు మినహా బంధువులు, స్నేహితులు కలిపి ఐదురుగు మాత్రమే హాజరయ్యారు. వారంతా ఇర్ఫాన్​కు నివాళి అర్పించారు.

ఇర్ఫాన్ ఖాన్ పార్థివ దేహాన్ని మోస్తున్న అతడి కుమారులు

ఆరోగ్యం క్షీణించడం వల్ల నిన్న(మంగళవారం).. ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరిన ఇర్ఫాన్.. ఈరోజు తీవ్ర అస్వస్థతకు గురై మరణించారు. 2018 నుంచి న్యూరో ఎండోక్రైన్​ ట్యూమర్​తో బాధపడుతున్నారు. గత శనివారమే ఇతడి తల్లి సయిదా మృతి చెందారు. ఇలా ఇర్ఫాన్ కుటుంబంలో వరుస మరణాలు సంభవించడం వల్ల వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ABOUT THE AUTHOR

...view details