తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఫిట్​నెస్​ ట్రైనర్​తో ఆమిర్​ కుమార్తె ప్రేమాయణం! - నుపూర్​ షీఖరే ఐరా ఖాన్

స్టార్​ హీరో ఆమిర్​ ఖాన్​ కుమార్తె ఐరా ఖాన్​ మరోసారి ప్రేమలో పడినట్లు బాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఫిట్​నెస్​ ట్రైనర్​ నుపూర్​ షీఖరేతో ఐరా డేటింగ్​లో ఉన్నట్లు పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.

Ira Khan Dating Fitness Coach Nupur Shikhare?
ఫిట్​నెస్​ ట్రైనర్​తో ఆమిర్​ కుమార్తె ప్రేమాయణం!

By

Published : Nov 25, 2020, 10:02 AM IST

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ కుమార్తె ఐరా ఖాన్‌ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. మిషాల్‌ అనే వ్యక్తితో కొంతకాలంపాటు రిలేషన్‌లో ఉన్న ఐరా.. పలు సందర్భాల్లో అతనిపై ఉన్న ప్రేమను సోషల్‌మీడియా వేదికగా తెలియజేసింది. అయితే మిషాల్‌-ఐరాల మధ్య మనస్పర్థలు రావడం వల్ల వీరిద్దరూ గతేడాది విడిపోయారు. ఈ నేపథ్యంలోనే ఐరాఖాన్‌ తన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపూర్‌ షీఖరేతో తాజాగా ప్రేమలో పడినట్లు పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.

నుపూర్​ షీఖరే, ఐరా ఖాన్​

కొన్నేళ్లుగా ఆమిర్‌కు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా వ్యవహరిస్తున్న నుపూర్..‌ లాక్‌డౌన్‌ నుంచి ఐరాకు సైతం వర్కౌట్ల విషయంలో కోచ్‌గా మారారు. అయితే, నుపూర్‌ వ్యక్తిత్వం నచ్చడం వల్ల ఐరా అతనితో ప్రేమలో పడిందని.. కొన్నినెలలుగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా ఐరా ఇప్పటికే ఈ విషయాన్ని తన తల్లికి చెప్పగా.. ఆమె కూడా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో ఈ జంట ఇటీవల ఆమిర్‌ఖాన్‌ ఫామ్‌హౌస్‌లో స్నేహితులతో కలిసి పార్టీ కూడా చేసుకున్నారని సమాచారం. వీరిద్దరికీ సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

ABOUT THE AUTHOR

...view details