ఒకానొక సమయంలో సినిమాల్లో అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయని నటి అనసూయ తెలిపారు. ఆ సమయంలో ఎంతో ఆవేదనకు లోనయ్యానని ఆమె అన్నారు. బుల్లితెర వ్యాఖ్యాతగా కెరీర్‌ను ఆరంభించిన అనసూయ ప్రస్తుతం యాంకర్‌గానే కాకుండా నటిగానూ రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఎదుర్కొన్న ఎన్నో ఇబ్బందులను బయటపెట్టారు.
తాను ధరించే దుస్తులపై ఎన్నో సందర్భాల్లో నెటిజన్ల నుంచి నెగిటివ్ కామెంట్లు వచ్చాయని అనసూయ అన్నారు. అలాగే తన పెద్దకుమారుడు కూడా.. తాను వెస్ట్రన్ దుస్తులు ధరిస్తే బాలేదని.. పొడవాటి దుస్తులు ధరించమని చెబుతాడని ఆమె తెలిపారు. అనంతరం ఎన్నో సందర్భాల్లో తాను కన్నీళ్లు పెట్టుకున్నానని వెల్లడించారు.