తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Gamanam movie: 'అలాంటి సినిమాల్లో నటించలేను' - shivakandukuri interview

Shivakandukuri Interview: ఇళయరాజాతో పని చేసే అవకాశమొస్తుందని కలలో కూడా అనుకోలేదని అన్నారు యువ హీరో శివ కందుకూరి. ఈ నెల 10న ఆయన నటించిన 'గమనం' సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం తన కెరీర్​లో ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పారు. ఇంకా ఈ చిత్ర విశేషాలు సహా కెరీర్​ గురించి పలు ఆసక్తికర సంగతులను తెలిపారు. అవన్నీ ఆయన మాటల్లోనే..

శివకందుకూరి గమనం సినిమా, Shiva kandukuri gamanam movie
శివకందుకూరి గమనం సినిమా

By

Published : Dec 7, 2021, 7:43 AM IST

Shivakandukuri Interview: "ఇన్ని సినిమాలు చేయాలని లెక్కలేసుకుంటూ వెళ్లడం నచ్చదు. వచ్చే పదేళ్లలో ఐదు సినిమాలు చేసినా సరే.. మంచివే చేయాలనుకుంటున్నాను" అన్నారు శివ కందుకూరి. నిర్మాత రాజ్‌ కందుకూరి వారసుడిగా 'చూసీ చూడంగానే' చిత్రంతో తెరపై మెరిసిన కథానాయకుడాయన. ఇప్పుడు రెండో సినిమాగా 'గమనం'లో నటించారు. శ్రియ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సుజనా రావు తెరకెక్కించారు. ఈ సినిమా ఈనెల 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర విశేషాలను తెలిపారు శివ కందుకూరి.

"గమనం నా కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన సినిమా అవుతుంది. సుజన కథ చెప్పినప్పుడే నాకు బాగా నచ్చేసింది. ఈ కథ వింటున్నప్పుడు.. దీనికి ఇళయరాజా స్వరాలందిస్తారని, బాబా సర్‌ కెమెరామెన్‌ అని తెలియదు. నేనిందులో అలీ అనే ముస్లిం కుర్రాడిగా కనిపిస్తా. క్రికెటర్‌ కావాలనే లక్ష్యంతో జీవిస్తుంటా. అలాగే నాకొక ప్రేమకథ ఉంటుంది. నా ప్రేయసి జారాగా ప్రియాంక కనిపిస్తుంది".

"ఈ సినిమాతో చారు హాసన్‌ లాంటి సీనియర్‌ నటుడితో కలిసి పని చేసే అవకాశం దొరికింది. అది నా అదృష్టం".

"నేను చేసే ప్రతి సినిమా కథను మా నాన్నతో తప్పకుండా చర్చిస్తాను. కానీ, అది చేయాలా? వద్దా? అన్న నిర్ణయం నా మీదే వదిలేస్తారు. ఏ కథైనా సరే.. నా మనసుకు కనెక్ట్‌ అయితేనే చేస్తాను. పెద్ద విజయాలు సాధించిన చిత్రాలు కూడా కొన్ని రోజులే గుర్తుంటాయి. సినిమాలోని ఎమోషన్‌ సరిగ్గా కనెక్ట్‌ అయితే మాత్రం అవి మరింత ఎక్కువ కాలం గుర్తుండిపోతాయి. నాకలా ఎమోషన్‌ కనెక్ట్‌ కాకపోతే సినిమాలు చేయలేను. ప్రస్తుతం నేను 'మను చరిత్ర' అనే చిత్రం చేస్తున్నా. నాని నిర్మాణంలో రూపొందుతోన్న 'మీట్‌ క్యూట్‌' వెబ్‌సిరీస్‌లోనూ చేస్తున్నా. అందులో అదా శర్మకు జోడీగా కనిపిస్తా. అలాగే మరో రెండు చిత్రాలకు సంతకాలు చేశా".

"ఈ చిత్రం కోసం నేను క్రికెట్‌లో ట్రైనింగ్‌ తీసుకున్నాను. నిజానికి ఇండియాలో ఉన్నప్పుడు క్రికెట్‌ బాగానే ఆడేవాణ్ని. కానీ, చదువుల కోసం యూఎస్‌కు వెళ్లాక ప్రాక్టీస్‌ పోయింది. అందుకే ఈ సినిమా కోసం మళ్లీ శిక్షణ తీసుకున్నా. ఇళయరాజా సర్‌తో పని చేసే అవకాశమొస్తుందని కలలో కూడా అనుకోలేదు. అది అసాధ్యమనుకున్నా. కానీ, ఆ కల ఈ చిత్రంతో నెరవేరింది. ఆయన తన నేపథ్య సంగీతంతో ఈ చిత్రాన్ని మరోస్థాయికి తీసుకెళ్లారు. సినిమాలో అండర్‌ వాటర్‌లో కొన్ని సీన్స్‌ ఉంటాయి. వాటిని జ్ఞానశేఖర్‌ సర్‌ విజువల్‌గా ఎంతో అద్భుతంగా తీశారు".

ఇదీ చూడండి: బోల్డ్​ క్యారెక్టర్​ చేయడానికైనా సిద్ధమే: ప్రియాంక

ABOUT THE AUTHOR

...view details