తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అమితాబ్​-అజయ్​ సినిమాలో ప్రముఖ యూట్యూబర్​ - రకుల్​ ప్రీత్

యూట్యూబ్​లో వీడియోలు చేసిన అతడు.. ఏకంగా బాలీవుడ్​ ఛాన్స్​ కొట్టేశాడు. అమితాబ్​ బచ్చన్​- అజయ్​ దేవ్​గణ్​ కాంబోలో తెరకెక్కుతున్న 'మే డే'లో నటించే అవకాశాన్ని సంపాదించాడు. ఇంతకీ ఎవరా యూట్యూబర్​?

Internet sensation CarryMinati to make acting debut with Ajay Devgn's MayDay
బాలీవుడ్​లో ఛాన్స్​ కొట్టేసిన యూట్యూబ్​ స్టార్​

By

Published : Dec 18, 2020, 8:35 PM IST

ప్రముఖ యూట్యూబర్ క్యారీ మినాటీ.​. బాలీవుడ్​లో బంపర్​ ఆఫర్​ కొట్టేశాడు. అజయ్​ దేవ్​గణ్ దర్శకత్వంలో అమితాబ్​ బచ్చన్ నటిస్తున్న 'మే డే'లో తనకు అవకాశం వచ్చినట్లు వెల్లడించాడు.

క్యారీ మినాటీకి యూట్యూబ్​లో 27.5 మిలియన్ల మంది సబ్​స్క్రైబర్స్​ ఉన్నారు. పలు వీడియోలతో ఇప్పటికే చాలా పేరు తెచ్చుకున్నాడు. బిగ్​బీ సరసన అవకాశం దక్కడం పట్ల తెగ సంతోషపడిపోతున్నాడు.

'యూ మీ ఔర్ హమ్'​, 'శివాయ్'​ తర్వాత మళ్లీ మెగాఫోన్​ పట్టిన అజయ్​ దేవ్​గణ్​.. ఈ 'మే డే' స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో అజయ్​, పైలట్​గా కనిపించనున్నారట. రకుల్​ ప్రీత్​ కూడా ఇలాంటి​ పాత్రలోనే కనిపించనున్నట్లు తెలుస్తోంది.

అంతకుముందు మరో యూట్యూబర్ ప్రజాక్త కోలీ.. వరుణ్​ ధావన్​, కియారా అడ్వాణీ నటిస్తున్న 'జుగ్ జుగ్​ జియో' సినిమాలో అవకాశాన్ని అందుకుంది. రాజ్​ మెహత్​ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదీ చూడండి:విక్రమ్​ వేదా' రీమేక్​ నుంచి ఆమిర్​ తప్పుకున్నారా?

ABOUT THE AUTHOR

...view details