తెలంగాణ

telangana

ETV Bharat / sitara

AR Rahman Songs: ఏఆర్​ రెహమాన్​కు ప్రత్యేక గౌరవం - ఏఆర్ రెహమాన్

ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్​ రెహమాన్​కు (ar rahman songs) మరో అరుదైన గౌరవం లభించింది. సంగీత రంగంలో చేసిన కృషికి గానూ ఆయనను 43వ కైరో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్​లో (సిఫ్) ప్రత్యేకంగా సన్మానించారు.

AR Rahman Songs
ఏఆర్ రెహమాన్

By

Published : Nov 30, 2021, 8:11 AM IST

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్.. ప్రత్యేక గౌరవాన్ని అందుకున్నారు. సంగీత రంగంలో (ar rahman songs) ఆయన చేసిన కృషికి గానూ (cairo international film festival) 43వ కైరో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్​లో (సిఫ్) ఆయన్ను ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిఫ్ ప్రెసిడెంట్ మహమ్మద్ హెఫ్జి చేతుల మీదుగా గౌరవ ట్రోఫీని అందుకున్నారు రెహమాన్.

అవార్డు అందుకుంటున్న ఏఆర్​ రెహమాన్

ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశారు రెహమాన్. ఈ సందర్భంగా వేడుకలో ట్రోఫీ అందుకుంటూ దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

రెహమాన్ ప్రశంసాపత్రం

ఆఫ్రికాలో అత్యంత పురాతన చలన చిత్రోత్సవం 'సిఫ్'. ఈజిప్టులోని కైరో ఒపెరా హౌస్​లో నవంబర్ 28న ప్రారంభమైన ఈ ప్రతిష్ఠాత్మక చిత్రోత్సవం.. డిసెంబర్ 5న ముగియనుంది.

ఇదీ చూడండి:Khatija Rahman: రెహమాన్​ కూతురికి అంతర్జాతీయ అవార్డు

ABOUT THE AUTHOR

...view details