తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మైదాన్‌'లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు - అమిత్ శర్మ

అజయ్ దేవ్​గణ్ హీరోగా అమిత్ శర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న బాలీవుడ్ చిత్రం 'మైదాన్'. ఫుట్​బాల్ నేపథ్యంలో రూపొందనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత ఫుట్​బాల్ ఆటగాళ్లు ఈ చిత్రంలో కనిపించనున్నారు.

Maidan movie
మైదాన్

By

Published : Apr 12, 2021, 7:25 AM IST

'లగాన్‌' అనగానే క్రికెట్‌, 'ఛక్‌దే' అనగానే హాకీ ఎలాగో 'మైదాన్‌' అంటే ఫుట్‌బాల్‌ అనేలా తమ సినిమా ఉంటుంది అంటున్నారు అమిత్‌ శర్మ. అజయ్‌ దేవ్‌గణ్‌ ప్రధాన పాత్రలో ఆయన తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు కీలకం కానున్నాయి. మనదేశం వివిధ దేశాలతో ఆడిన మ్యాచ్‌లను ఈ చిత్రంలో ఆవిష్కరించనున్నారు. ఇందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు ఈ చిత్రంలో కనిపించనున్నారు.

మైదాన్

జపాన్‌, దక్షిణ కొరియా, ఫ్రాన్స్‌, థాయ్‌లాండ్ తదితర దేశాల నుంచి ఆటగాళ్లు రానున్నారు. ఆస్ట్రేలియాలో లాక్‌డౌన్‌ కారణంగా అక్కడి నుంచి ఆటగాళ్లు రావడానికి సమస్యలు ఎదురవుతున్నాయని చిత్రవర్గాలు చెబుతున్నాయి. "ఇప్పటికే థాయ్‌లాండ్ ఆటగాళ్లు ఇక్కడికి చేరుకున్నారు. నేను కరోనా నుంచి కోలుకోవడం గురించి వాళ్లంతా ఎదురుచూస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ మ్యాచ్‌లను తెరకెక్కించనున్నాం. భారతదేశం గర్వించే ఓ గొప్ప చిత్రాన్ని ప్రపంచానికి ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం" అని అమిత్‌ చెప్పారు. అక్టోబరులో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details