తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రభాస్ తర్వాతి సినిమా అలా ఉండబోతోంది..! - prabhas20

'బాహుబలి' హీరో ప్రభాస్ నటించబోయే తదుపరి సినిమా ఎలా ఉండబోతుందో తెలిపాడు యంగ్ రెబల్ స్టార్. ఇది యూరప్ నేపథ్యంలో సాగే విభిన్న ప్రేమకథని చెప్పాడు.

ప్రభాస్

By

Published : Aug 29, 2019, 9:27 AM IST

Updated : Sep 28, 2019, 5:02 PM IST

ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ చిత్రం 'సాహో' విడుదలకు సిద్ధమైంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్​లో భాగంగా హీరో యంగ్ రెబల్ స్టార్​ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో తన తదుపరి సినిమా గురించి ఆసక్తికర విషయం చెప్పాడు.

'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా 1960 నాటి యూరప్ నేపథ్యంలో సాగుతుందట. ఇదో ప్రేమకథ అని.. ఇలాంటి విభిన్న కాన్సెప్ట్​ ఇప్పటివరకు భారతీయ చిత్రాలలో చూసి ఉండరని చెప్పుకొచ్చాడు ప్రభాస్.

భారీ బడ్జెట్ సినిమా కాకపోయినప్పటికీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుందట. ఈ చిత్రం ఇప్పటికే 20 రోజులకు పైగా చిత్రీకరణ జరుపుకొంది. వచ్చే ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది చిత్రబృందం.

ఇవీ చూడండి.. దిశా.. నిన్ను చూస్తే ఎక్కుతుంది నిషా..!

Last Updated : Sep 28, 2019, 5:02 PM IST

ABOUT THE AUTHOR

...view details