పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు క్రిష్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేయగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా టైటిల్‌పై ఆసక్తికర అప్డేట్ తెలిసింది. ఈ చిత్రానికి 'ఓం శివమ్' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారికంగా ఎటువంటి స్పష్టత రాలేదు.
పవన్-క్రిష్ సినిమా టైటిల్ అదేనా? - పీకే, క్రిష్ సినిమా
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌పై ఆసక్తికర అప్డేట్ చిత్రసీమలో చక్కర్లు కొడుతోంది.

పీకే- క్రిష్
ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పీకే సరసన నటించనున్నట్లు సమాచారం. పవన్ ఈ చిత్రంలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి.