వానా కాలం వచ్చేసింది... మామూలు రోజుల్లో అయితే సందడే సందడి. చిన్న చినుకుపడితే అలా బయటకు వచ్చి సరదాగా వర్షంలో తడిసి... ఇంట్లోకి వెళ్లి అమ్మతో నాలుగు తిట్లు తింటూ అమ్మ చేసిన పకోడి తినేవాళ్లం. కానీ ఇప్పుడు కరోనా భయంతో వర్షాన్ని అద్దాల్లోంచి, కిటికీల్లోంచి చూస్తున్నాం. గతంలోని వర్షంలో తడిసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాం.
ఇన్‌స్టాగ్రామ్‌లో టాలీవుడ్ 'జల' తారలు - Heroines insta photos
వాతావరణం కూల్‌గా ఉందంటే చాలు ప్రజలంతా టూర్లకు ప్లాన్ చేసుకునే వాళ్లు. కానీ, దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న కారణంగా ఇంటికే పరిమితమవ్వడం ఉత్తమం అని ఎక్కువ శాతం మంది భావిస్తున్నారు. సినీ హీరోయిన్లు ప్రస్తుతం అదే కోవలో చేరిపోయారు. ఇంట్లో ఉంటూనే వారు గతంలో ఆస్వాదించిన ప్రదేశాల తాలూకూ చిత్రాలను.. సోషల్‌మీడియాలో పంచుకుంటున్నారు. అవేంటో చూసేద్దామా.
ఇన్‌స్టాగ్రామ్‌లో టాలీవుడ్ జల తారలు
మనమే కాదు... కొంతమంది సినిమా కథానాయికలూ అదే పని చేస్తున్నారు. అప్పుడెప్పుడో జలకన్యల్లా మారి ఈత కొలనుల్లో, సముద్రంలో, నదుల్లో, జలపాతాల దగ్గర సేదతీరిన ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు జల'తార'ల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లను ఒకసారి స్క్రోల్ చేస్తే.. ఈ పోస్టులు కనిపించాయి. మీరూ చూసేయండి.