'శ్రీనివాస కల్యాణం' తర్వాత దాదాపు ఏడాది విరామం తీసుకున్న నితిన్.. ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా గడిపేస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో నటిస్తోన్న కొత్త చిత్రం 'భీష్మ' వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీని తర్వాత నితిన్.. వెంకీ అట్లూరితో 'రంగ్ దే', చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే వెంకీ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లగా.. యేలేటితో చేయబోయే సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందన్నది స్పష్టత లేదు.
రెండు భాగాలుగా.. నితిన్ కొత్త చిత్రం..!
ప్రస్తుతం 'భీష్మ', 'రంగ్ దే' చిత్రాలతో బిజీగా ఉన్నాడు యువ హీరో నితిన్. ఈ సినిమాలు సెట్స్‌పై ఉండగానే మరో కొత్త చిత్రానికి ఓకే చెప్పాడట. ఇది రెండు భాగాలుగా తెరకెక్కనుందని సమాచారం.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నితిన్ మరో క్రేజీ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపినట్లు చిత్ర వర్గాల నుంచి సమాచారం అందుతోంది. 'పవర్ పేట' పేరుతో రూపొందబోయే ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. దీనికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించనున్నాడట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుందట. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందని, ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం.
ఇవీ చూడండి.. రెట్టింపు నవ్వులకు రంగం సిద్ధమైందా..!