తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చిరు కొత్త సినిమాలో పవన్​.. నిజమేనా? - chiranjeevi pawankalyan relationship

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​(chiranjeevi pawan kalyan movie).. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిరు '154' సినిమాలో నటించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశముందని అంతా మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే వేచి ఉండాల్సిందే.

chiru
చిరు పవన్​

By

Published : Nov 7, 2021, 10:12 AM IST

మెగాస్టార్​ చిరంజీవి, పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​(chiranjeevi pawan kalyan movie) కలిసి ఒకే తెరపై సందడి చేస్తే చూడాలనేది ప్రతి అభిమాని కోరిక. గతంలో పవన్​.. చిరు నటించిన 'శంకర్​దాదా జిందాబాద్'​లో అతిథి పాత్రలో మెరిశారు(chiranjeevi pawan kalyan movie). ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తారని ఊహాగానాలు వినిపించినా ఆ కాంబో ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. అయితే ఇప్పుడు ఈ మెగాబ్రదర్స్​ కలిసి నటించేందుకు సిద్ధమయ్యారని మరోసారి ప్రచారం ఊపందుకుంది.

చిరు నటించనున్న 154వ సినిమా(bobby chiranjeevi movie) షూటింగ్​ నవంబరు 6న లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలోనే పవన్​ కూడా నటించనున్నారంటూ టాలీవుడ్​ టాక్​. అయితే అది పూర్తిస్థాయి పాత్ర లేదా గెస్ట్​ రోల్ అనేది స్పష్టత లేదు. నెట్టింట్లో దీనిపై అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. ఈ విషయం గురించి త్వరలోనే చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్​ ప్రకటన చేస్తుందట! మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.

త్వరలోనే చిరు.. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన 'ఆచార్య'(chiranjeevi acharya movie) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీంతోపాటు 'గాడ్​ఫాదర్'​, 'భోళాశంకర్'​ చిత్రాల్లోనూ నటిస్తుండగా.. పవన్​కల్యాణ్​ 'భీమ్లానాయక్'​, 'హరిహర వీరమల్లు', హరీశ్​ శంకర్​ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

ఇదీ చూడండి: మాస్​ లుక్​లో చిరు​.. బాబీతో సినిమా షురూ

ABOUT THE AUTHOR

...view details