టాలీవుడ్ హీరో నితిన్, రష్మిక మందణ్న హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 'భీష్మ'. దీపావళి సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన చిత్రబృందం. తాజాగా ఫస్ట్ గ్లిమ్స్ అంటూ ఓ వీడియోను విడుదల చేసింది.
కొత్త వీడియో చూస్తుంటే నితిన్, రష్మిక జంట తెరపై కనువిందు చేయబోతున్నట్లు తెలుస్తోంది. రష్మిక నడుమును చూస్తూ నితిన్ మరోసారి పవన్ కల్యాణ్ 'ఖుషి'ని తలపించాడు. "నా లవ్వు కూడా విజయ్ మాల్యా లాంటిదిరా.. కనిపిస్తుంటది కానీ.. క్యాచ్ చేయలేం" అంటూ నితిన్ పలికే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది.