యువ కథానాయకుడు నాగశౌర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'అశ్వథ్థామ'. మెహరీన్ హీరోయిన్. రమణ తేజ అనే కొత్త దర్శకుడు ఈ సినిమా ద్వారా పరిచయం కానున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
టీజర్: అశ్వథ్థామ.. ఆరడుగుల నారాయణాస్త్రం - అశ్వథ్థామ
నాగశౌర్య, మెహరీన్ ప్రధానపాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'అశ్వథ్థామ'. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది.
టీజర్
"ఎలా ఉంటాడో కూడా తెలియని ఓ రాక్షసుడు. వాడికి మాత్రమే తెలిసిన ఓ రహస్యం. సైరన్ కూతల కింద పనిచేసే వాడి సైన్యం" అంటూ సాగే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. నేపథ్యం సంగీతం బాగుంది. మొత్తంగా ఈ ప్రచారచిత్రం సినిమాపై అంచనాల్ని పెంచేసింది.
ఇవీ చూడండి.. స్టార్ బర్త్‌డే స్పెషల్: హమారా భాయ్‌జాన్.. సల్మాన్‌ఖాన్