తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సెట్స్​ పైకి వెళ్లనున్న 'ఇన్షాల్లా' - inshaallah

సల్మాన్ ఖాన్, ఆలియా భట్ ఓ చిత్రంలో నటించబోతున్నారు. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.

ఆలియా

By

Published : Jul 1, 2019, 8:34 PM IST

సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్, అలియాభట్‌లు కలిసి నటిస్తున్న చిత్రం 'ఇన్షాల్లా'. సుమారు పన్నెండేళ్ల తర్వాత భన్సాలీ దర్శకత్వంలో సల్మాన్‌ నటించబోతున్న సినిమా అయినందున మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి.

సినిమా లొకేషన్స్‌ కోసం చాలా ప్రదేశాలు పరిశీలించిన తర్వాత చివరకు మొదటి షెడ్యూల్‌ షూటింగ్‌ కోసం కాలిఫోర్నియా, ప్లోరిడాలను ఎంచుకుంది చిత్రబృందం. త్వరలోనే ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభం కానుంది. రొమాంటిక్‌ కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే 'ఈద్‌' పండుగ నాటికి తెరపైకి తీసుకొస్తామని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది.

తొలుత ఆలియాభట్‌ - సల్మాన్‌ఖాన్‌ కాంబినేషన్‌ అనగానే చాలామందికి కొన్ని అనుమానాలు వచ్చాయి. సల్మాన్‌ వయసు యాభై మూడేళ్లు, ఆలియా వయసు ఇరవై ఆరు వీరిమధ్య రొమాన్స్‌ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తున్నాయి.

ఇవీ చూడండి.. సల్మాన్​.. కోతి.. ఓ పర్యావరణ పాఠం

ABOUT THE AUTHOR

...view details