కరోనా కారణంగా థియేటర్లు చాలారోజులగా మూతపడ్డాయి. కొద్ది నెలల కిందట తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకోగా ప్రేక్షకాదరణ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. దీంతో పలు రాష్ట్రాలు థియేటర్లను రీఓపెన్ చేసేందుకు ముందుకొస్తున్నాయి. కాగా, మహారాష్ట్రలో శుక్రవారం (అక్టోబర్ 22) నుంచి థియేటర్లు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఐనాక్స్(inox free tickets maharashtra) ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
ఐనాక్స్ బంపర్ ఆఫర్.. ఫ్రీగా సినిమాలు చూసేయండి! - ఐనాక్స్ మహారాష్ట్ర
ఐనాక్స్ థియేటర్స్(inox movies) గ్రూప్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అక్టోబర్ 22న తమ గ్రూప్ థియేటర్లలో ఉచితంగా సినిమాలు వీక్షించొచ్చని వెల్లడించింది. మరి ఇదెక్కడో తెలుసా?
ఐనాక్స్
మహారాష్ట్రలో థియేటర్లు తెరుచుకునే శుక్రవారం రోజున ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రాష్ట్రమంతటా ఐనాక్స్ థియేటర్లలో ఉచితంగా సినిమాలు(inox free tickets maharashtra) చూడొచ్చని ప్రకటించింది. అయితే ఒక బుకింగ్‌లో రెండు టికెట్లు మాత్రమే ఇస్తామని వెల్లడించింది. ప్రేక్షకుల్లో కరోనా భయం పోయి థియేటర్లలో తిరిగి జనాల సందడి కనిపించాలన్న ఉద్దేశంతో ఈ ఆఫర్ ఇస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.