ప్రభాస్ సినిమాల జాబితా అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే నాలుగు సినిమాల పనులతో బిజీగా ఉన్నారాయన. ఆ తర్వాత చేయనున్న చిత్రం గురించి బాలీవుడ్‌లో చర్చ మొదలైంది. ప్రభాస్ కోసం 'వార్' దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ పూర్తిస్థాయిలో కథని సిద్ధం చేసి వినిపించారని, త్వరలోనే ఆ చిత్రం గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని బాలీవుడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.
ఇదీ చదవండి:విశ్వక్ సేన్ కొత్త చిత్రం టైటిల్ ఖరారు