యువహీరో వరుణ్ సందేశ్ దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత నటించిన చిత్రం 'ఇందువదన'. ఫర్నాజ్ శెట్టి కథానాయిక. ఈ సినిమా టీజర్‌ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు బుధవారం విడుదల చేశారు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే 'ఇందువదన' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో నటీనటులు, దర్శక నిర్మాతలు చిత్ర విశేషాలను పంచుకున్నారు.
మరో జానపదం..
తెలుగు తెరపై జానపదాల జోరు పెరుగుతోంది. ఇప్పటికే పలు పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించి చిత్రాల విజయంలో కీలకంగా నిలువగా.. నాగశౌర్య, రీతూవర్మ 'వరుడు కావలెను'లో మరో జానపద గీతం సినీ ప్రియులను అలరించేందుకు వచ్చింది. 'దిగు దిగు నాగ' అంటూ అశేష ఆదరణ పొందిన ఈ జానపదాన్ని ఈ సినిమా కోసం ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ తనదైన శైలిలో మలిచారు. తమన్ సంగీతం అందించగా.. శ్రేయా ఘోషల్ పాడారు. కథానుగుణంగా ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ పాట.. సినిమాపై ఆసక్తి పెంచుతోంది. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించగా, సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
ఇదీ చదవండి:ఒకే రోజు 16 పాటలు.. అమ్మ మందలించింది: సింగర్ చిత్ర