తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రముఖ జర్నలిస్ట్​ పట్ల హాస్యనటుడు దురుసు ప్రవర్తన - కునాల్​ ఎయిర్​ ఇండియా

ఇండిగో విమానంలో ప్రముఖ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి​ పట్ల అనుచితంగా ప్రవర్తించిన హాస్య నటుడు కునాల్ కమ్రాపై ఆరు నెలల నిషేదం విధించింది సదరు సంస్థ.

IndiGo on Tuesday suspended stand-up comedian Kunal Kamra from flying with the private airline for six months
ఆ విమానాల్లో ప్రయాణం కునాల్​కు నిషేధం

By

Published : Jan 29, 2020, 10:06 AM IST

Updated : Feb 28, 2020, 9:11 AM IST

తమ సంస్థకు సంబంధించిన విమానాల్లో ప్రయాణించకుండా బాలీవుడ్​ హాస్య నటుడు కునాల్​ కమ్రాపై ఆరు నెలలు నిషేధం విధించింది ఇండిగో. ముంబయి నుంచి లక్నో ప్రయాణిస్తున్న సహ ప్రయాణికుడు, ప్రముఖ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకే ఈ చర్య తీసుకున్నట్లు ట్వీట్ చేసింది.

మంగళవారం విమానంలో ప్రయాణించిన కునాల్.. సహ ప్రయాణికుడైన అర్నబ్ గోస్వామిని దుర్భాషలాడాడు. ఆ వీడియోను తన ట్విట్టర్​లో పోస్ట్ చేశాడు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఇండిగో.. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే చర్యలను తాము సహించమని స్పష్టం చేసింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి: 'అందుకే సినిమా పేరును పచ్చబొట్టు వేయించుకున్నా'

Last Updated : Feb 28, 2020, 9:11 AM IST

ABOUT THE AUTHOR

...view details