సృజనాత్మకతకు ఒకప్పుడు కేరాఫ్ అడ్రస్ కేవలం వెండితెర మాత్రమే. డిజిటల్ విప్లవం తర్వాత ట్రెండ్ మారింది. ప్రేక్షకుడి అభిరుచిలోనూ మార్పు వచ్చింది. అందుకే ఆలోచన, అందంగా ప్రదర్శించగలిగే నైపుణ్యం ఉన్నవాళ్లకు ఆసరాగా నిలిచాయి వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు. వాటిని ప్రదర్శించేందుకు యూట్యూబ్, ఓటీటీలు వేదికలయ్యాయి. అయితే కార్పోరేట్ సంస్థల చేతుల్లో ఉన్న ఓటీటీలపై కన్నేసిన సినీలోకం... వారూ అదే మార్గంలోకి వచ్చి వాటి డిమాండ్‌ను మరింత పెంచేశారు. ఫలితంగా ఆయా కంపెనీలు 24 విభాగాల ఔట్‌పుట్‌ను కొంతకు కొనేసి.. వారి యాప్‌ల్లో పెట్టేసుకుంటున్నాయి.
ఇది ఆరంభంలో బాగానే ఉన్నా వాటికీ కొంత రుసుము పెట్టడమే వినియోగదారుడికి భారంగా మారింది. అయితే కొందరు మాత్రం వారు తీసిన కళాప్రదర్శనలను ఉచితంగానే అందిస్తామని యూట్యూబ్ వేదికను ఎంచుకున్నారు. అందుకే వెబ్ సిరీస్‌లను కూడా రూపాయి తీసుకోకుండా యూజర్లకు చూపించేస్తున్నారు. ఓసారి అలాంటి వాటిపై లుక్కేద్దాం...
కోటా ఫ్యాక్టరీ
టీవీఎఫ్ అనే సంస్థ తెరకెక్కిస్తున్న ఈ సిరీస్ నుంచి ఇప్పటివరకు ఐదు ఎపిసోడ్లు మాత్రమే విడుదలయ్యాయి. 16 ఏళ్ల అబ్బాయి ఐఐటీ పరీక్షల కోసం కోటా అనే పట్టణానికి వెళ్తాడు. అక్కడ ఆ కుర్రాడు ఎదుర్కొన్న కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించింది చిత్రబృందం. ఇందులో నటీనటులు చేసిన యాక్టింగ్‌కు వీక్షకులు ఫిదా అయిపోయారు.
స్టార్ బాయ్స్
ఇద్దరు దక్షిణాది కుర్రాళ్లే ప్రధానంగా తెరకెక్కిన ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఆరు ఎపిసోడ్లు విడుదలయ్యాయి. నవీన్ రిచర్డ్స్, కెన్నీ సెబాస్టియన్ అనే కుర్రాళ్లు ఇందులో నటిస్తున్నారు. తక్కువ బడ్జెట్‌తోనే రూపొందిన ఈ సిరీస్‌ను కామెడీ జోనర్లో రూపొందించారు. అందుకే ఈ సిరీస్ చూస్తే పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటారని నెటిజన్లు చెప్తున్నారు.
మామ్ అండ్ కో
తల్లీకొడుకుల మధ్య ఆప్యాయత, అనుబంధాన్ని ఇందులో చూపించారు. పలు కారణాల వద్ద దూరమైన తన కొడుకును ఆ తల్లి ఎలా కలుసుకుంది అనేది కథాంశం. ఆ సమయంలో వారి ప్రేమానురాగాలను హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించారు. ఈ సిరీస్‌ను మీ అమ్మతో చూస్తే.. ఆ ఎమోషన్ భలే ఉంటుందని అంటోంది చిత్రబృందం.
అడల్టింగ్
ఇప్పటివరకు రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌లో ఇద్దరు అమ్మాయిలు కీలకపాత్రల్లో నటించారు. రూమ్మేట్స్గా ఏర్పడిన వారి పరిచయం ఎక్కడకు దారి తీసింది అనేది ఆసక్తిగా చిత్రీకరించారు.
హ్యాపీ ఎవర్ ఆఫ్టర్..