శుక్రవారం విడుదలైన అవెంజర్స్ ఎండ్‌గేమ్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సమయంలోనే కాస్త డిఫరెంట్‌గా ఆలోచించింది పశ్చిమ రైల్వే శాఖ. రైళ్లలో వచ్చి పోయే ప్రయాణికులకు అవెంజర్స్ పద్ధతిలో హెచ్చరించింది. సంబంధిత విషయాన్ని ట్విట్టర్లో పంచుకుంది.
అవెంజర్స్ స్టైల్లో రైల్వేశాఖ హెచ్చరిక - అవెంజర్స్ స్టైల్లో రైల్వేశాఖ హెచ్చరిక
భారతీయ పశ్చిమ రైల్వే శాఖ ప్రయాణికుల్ని కాస్త డిఫరెంట్‌గా హెచ్చరించింది. అవెంజర్స్ ఎండ్‌గేమ్ సినిమాను ఆదర్శంగా తీసుకుని విభిన్నంగా ట్వీట్ చేసింది.
అవెంజర్స్ స్టైల్లో రైల్వేశాఖ హెచ్చరిక
"ఇక్కడ మీ ప్రాణాల్ని రక్షించడానికి ఏ అవెంజర్ రాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. రైల్వే స్టేషన్లో విధిగా కాలి వంతెనలు, ఎస్కలేటర్లు ఉపయోగించండి. పట్టాలు దాటేందుకు ప్రయత్నించకండి. అదే మీకు చివరి రోజు అవుతుంది" - పశ్చిమ రైల్వే శాఖ
ఇంతకు ముందు గల్లీబాయ్ సినిమాలోని అప్నా టైమ్ ఆయేగా అనే పాటను స్ఫూర్తిగా తీసుకుని టికెట్ లేని ప్రయాణికులకు వార్నింగ్ ఇచ్చింది. రైళ్లలో వెళ్లేటపుడు విధిగా టికెట్ తీసుకోవాలని సూచించింది.
Last Updated : Apr 28, 2019, 7:35 AM IST