ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ దర్శకుడు తీసిన లఘుచిత్రానికి అవార్డు దక్కింది. పుదుచ్చేరికి చెందిన అచ్యుతానంద ద్వివేది తీసిన 'సీడ్ మదర్' షార్ట్ ఫిల్మ్‌కు పురస్కారం లభించింది. మూడు నిమిషాల నిడివిగల ఈ లఘు చిత్రానికి అంతర్జాతీయ న్యూ టాలెంట్స్ విభాగంలో తృతీయ పురస్కారం వచ్చింది.
'సీడ్ మదర్' చిత్రం రహీబాయ్ సోమా పొపెరే అనే మహిళ గురించి తీశారు. ఈమె స్థానికంగా దొరికే విత్తనాల ద్వారా సంప్రదాయ వ్యవసాయ విధానాలతో మహారాష్ట్ర గ్రామాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చారు.