తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హాలీవుడ్​లో మెరిసిన భారతీయ నటులు వీరే! - india actors hollywood movies

చిత్రపరిశ్రమలో ఎందరో నటులు తమ ప్రతిభతో అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు. మరి కొంతమంది ఏకంగా అంతర్జాతీయ స్థాయి చిత్రాల్లో నటించి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇంతకీ వారెవరంటే?

Indian actors who plays roles in Hollywood
హాలీవుడ్​లో నటించిన భారత నటులు

By

Published : Apr 13, 2021, 8:50 AM IST

Updated : Apr 13, 2021, 11:32 AM IST

భారతీయ సినీ పరిశ్రమలో భాషకు సంబంధించిన అడ్డంకులు తొలిగిపోతున్నాయి. భాష ఏదైనా నటించేందుకు సై అంటున్నారు నటీనటులు. అలానే వారు ఏ చిత్రసీమకు చెందినవారైనా వారితో సినిమా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే ఎంతోమంది నటులు తమదైన నటనశైలితో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తూ క్రేజ్​ సంపాదించుకుంటుంన్నారు. ఈ విధంగా తమ మార్కెట్​ విలువను పెంచుకుంటుంటుంటారు. అలా కొంతమంది తమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయి వరకు విస్తరించుకున్నారు. హాలీవుడ్​ సినిమాల్లోనూ కనిపించి అక్కడి ప్రేక్షకులనూ తమ నటనతో మెప్పించారు. ఇంతకీ వారెవరంటే..

ధనుష్​

కోలీవుడ్​ స్టార్​ హీరో ధనుష్​.. ఇప్పటికే 'ది ఎక్స్​ట్రార్డినరీ జర్నీ ఆఫ్​ ది ఫకీర్​' సినిమాలో నటించగా.. ప్రస్తుతం 'ది గ్రే మ్యాన్'​ సినిమాలో ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. ​

ప్రియాంకా చోప్రా

ప్రియాంకా చోప్రా.. 'బే వాచ్'​, 'ఏ కిడ్​ లైక్​ జేక్'​, 'ఈజ్​ నాట్​ రొమాంటిక్'​, 'ది స్కై ఈజ్​ పింక్​' ఇలా పలు సినిమాల్లో నటించింది. త్వరలోనే 'మ్యాట్రిక్స్'​, 'టెక్ట్స్​ ఫర్​ యు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ప్రియాంక.

పంకజ్​ త్రిపాఠి

పంకజ్​ త్రిపాఠి.. సామ్​ హర్​గ్రేవ్​ దర్శకత్వంలో 'ఎక్స్​ట్రాక్షన్'​ సినిమాలో నటించారు. ఇందులో మరో నటుడు రణ్​దీప్​ హూడా కూడా కనిపించారు. ఇందులో క్రిస్​ హెమ్స్​వర్త్​ ప్రధాన పాత్ర పోషించారు.

ఐశ్వర్యరాయ్​

ఐశ్వర్యరాయ్​ 'ది బ్రైడ్​ అండ్​ ప్రిజుడీస్​', 'పింక్​ పాంథర్​ 2', 'ది మిస్ట్రెస్ ఆఫ్​​ స్పీసెస్'​ ఇంకా పలు చిత్రాల్లో నటించగా.. దీపికా పదుకొణె.. 'ఎక్స్​ఎక్స్​ఎక్స్:​ ది రిటర్న్​ ఆప్​ క్సాండర్​ కేజ్'​తో అలరించారు.

అమితాబ్​ బచ్చన్​

అమితాబ్ బచ్చన్​.. 'ది గ్రేట్​ గాస్ బే' సినిమాలో నటించగా.. సూపర్​స్టార్​ రజనీకాంత్​ 'బ్లడ్​స్టోన్'​తో హాలీవుడ్​ ప్రేక్షకులను పలకరించారు.

అనిల్​కపూర్​

అనిల్​కపూర్​ 'మిషన్​ ఇంపాజిబుల్'​.. ఇర్ఫాన్​ ఖాన్​ 'జురాసిక్​ పార్క్'​, 'స్లమ్​ డాగ్​ మిలియనీర్​'తో అలరించారు.

అలీ ఫజల్​
శోభితా ధూళిపాలా

అలీ ఫజల్​.. 'ఫ్యూరియస్​ 7' సినిమాలో అతిథి పాత్ర పోషించారు. ప్రస్తుతం 'డెత్​ ఆన్​ ది నైల్​' చిత్రంలో నటిస్తున్నారు. ఇక శోభితా ధూళిపాలా 'మంకీ మ్యాన్​' అనే ఇంగ్లీష్​ చిత్రంతో హాలీవుడ్​ అరంగేట్రం చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్​ ప్రొడక్షన్​ పనులు జరుగుతున్నాయి. సికందర్ ఖేర్​ కూడా 'మంకీ మ్యాన్​'తో హాలీవుడ్​ వెండితెరపై మెరవనున్నారు.

సునీల్​ శెట్టి
రాధికా ఆప్టే

సునీల్​ శెట్టి 'కాల్​ సెంటర్'​ సినిమాలో నటించారు. ఇందులో ఓ పోలీస్​ ఆఫీసర్​గా కనిపించారు. రాధికా ఆప్టే.. ఇప్పటికే 'ది వెడ్డింగ్​ గెస్ట్'​, 'ది ఆశ్రమ్'​.. త్వరలోనే 'ఏ కాల్​ టు స్పై' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఇదీ చూడండి: ప్రియా భవాని.. నీకు ఫిదా ప్రతి అభిమాని!

Last Updated : Apr 13, 2021, 11:32 AM IST

ABOUT THE AUTHOR

...view details