తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'భారతీయుడు-2' ప్రమాదానికి కారణమైన స్టూడియోపై నిషేధం! - భారతీయుడు 2 సినిమా సమాచారం

'భారతీయుడు 2' చిత్రీకరణలో ఇటీవలే క్రేన్​ అదుపుతప్పిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం జరిగిన స్టూడియోలో ఇకపై సినిమా షూటింగ్​లు జరగకుండా నిషేధం విధించనున్నారు.

Indian 2: Was a ban imposed on the studios where the Kamal Haasan starrer was being shot
'భారతీయుడు-2' ప్రమాదానికి కారణమైన స్టూడియోపై నిషేధం!

By

Published : Feb 23, 2020, 7:05 PM IST

Updated : Mar 2, 2020, 7:56 AM IST

కమల్​ హాసన్​-శంకర్​ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న 'భారతీయుడు 2' షూటింగ్​లో, ఇటీవలే క్రేన్​ అదుపుతప్పి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కారణమైన క్రేన్​ ఆపరేటర్​ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ చిత్రీకరణ జరిగిన స్టూడియోపై ఇక నుంచి నిషేధం విధించనున్నారని సమాచారం.

స్టూడియోపై నిషేధం

ప్రమాదం జరిగిన ఈవీపీ ఫిల్మ్​ స్టూడియోపై, గతంలో ఫిల్మ్​ ఎంప్లాయిస్​ ఫెడరేషన్​ ఆఫ్​ సౌతిండియా(ఎఫ్​ఈఎఫ్​ఎస్​ఐ) మూడేళ్లపాటు నిషేధం విధించింది. తాజాగా దీనిని పునః ప్రారంభించి చిత్రీకరణలకు అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో 'భారతీయుడు 2' షూటింగ్​లో ప్రమాదం జరగటం వల్ల మరోసారి వార్తల్లో నిలిచిందీ స్టూడియో.

ప్రమాదానికి కారణమైన క్రేన్​
ప్రమాదానికి కారణమైన క్రేన్​

చిత్రయూనిట్​నూ విచారించే అవకాశం

ప్రమాదానికి కారణమైన క్రేన్ ఆపరేటర్ శిక్షణ తీసుకోలేదని, యంత్రాన్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలియదని పోలీసుల విచారణలో తేలింది. అతడిపై ప్రస్తుతం కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి, చిత్ర దర్శకుడు శంకర్, హీరో కమల్ హాసన్‌లను ప్రశ్నించే అవకాశముంది.

ఇదీ చూడండి..విజయ్ దేవరకొండ తర్వాతి చిత్రం ఆ దర్శకుడితో!

Last Updated : Mar 2, 2020, 7:56 AM IST

ABOUT THE AUTHOR

...view details