కమల్‌హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఇండియన్ 2'. ఈ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, శంకర్ మధ్య తలెత్తిన సమస్యల కారణంగా ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. ఈ వివాదం కోర్టు వరకూ వెళ్లింది.
ఎట్టకేలకు శంకర్, చిత్ర నిర్మాణ సంస్థ మధ్య చర్చలు సఫలం అయినట్టు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్టు చిత్రబృందం భావిస్తున్నట్టు తెలుస్తోంది.