కనబడుట లేదు అంటున్న సునీల్
నటుడు సునీల్ కీలక పాత్రలో తెరకెక్కిన క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ 'కనబడుటలేదు'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సునీల్ డిటెక్టివ్‌గా కనిపించనున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌కు ప్రేమకథ కూడా జోడించి దర్శకుడు బాలరాజు ఈ చిత్రాన్ని రూపొందించారు. మరి డిటెక్టివ్‌గా సునీల్ ఏ కేసును టేకప్ చేశాడు? దాన్ని ఎలా పరిష్కరించాడు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
సిద్ధార్థ్ 'ఒరేయ్ బామ్మర్ది'
సిద్దార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఒరేయ్ బామ్మర్ది'. 'బిచ్చగాడు' చిత్రాన్ని తెరకెక్కించిన శశి ఈ ప్రాజెక్ట్ రూపొందిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కీలకపాత్ర పోషించారు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల అంతకంతకూ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఆగస్టు 13న 'ఒరేయ్ బామ్మర్ది' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. సిద్దార్థ్ ఇందులో ట్రాఫిక్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. బైక్ రేసులంటే ఆసక్తి చూపించే ఆవేశపరుడైన యువకుడి పాత్రను జీవీ ప్రకాశ్ పోషించారు.
'సుందరి'గా అలరించనున్న పూర్ణ
పూర్ణ, అర్జున్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'సుందరి'. కల్యాణ్‌జీ గోగన దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా కూడా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక అందమైన అమ్మాయి జీవితంలో పురుషుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? కట్టుకున్న భర్త కూడా ఎందుకు నిందించాడు? అప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటి? ఆ నిర్ణయంతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సురేశ్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రిజ్వాన్ నిర్మిస్తున్నారు.
ది కంజురింగ్: దెయ్యం నా చేత చేయించింది
ప్యాట్రిక్ విల్సన్, వెరా ఫార్మిగా తదితరులు కీలక పాత్రల్లో నటించిన అమెరికన్ సూపర్‌నేచురల్ హారర్ ఫిల్మ్ 'ది కంజురింగ్: దెయ్యం నా చేత చేయించింది'. మైఖేల్ ఛవెస్ దర్శకత్వం వహించారు. జూన్‌లో అమెరికాలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు భారతీయ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆగస్టు 13న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
బ్రాందీ డైరీస్ కథ ఏంటి?
గరుడ శేఖర్‌నవీన్ వర్మ, కేవీ శ్రీనివాస్, రవీంద్రబాబు, దినేశ్, సునీత సద్గురు నటిస్తున్న చిత్రం ‘బ్రాందీ డైరీస్’. శివుడు దర్శకత్వం వహించారు. కలెక్టివ్ డ్రీమర్స్ పతాకంపై లీలా శ్రీకాంత్ నిర్మించారు. యువతను ఆకట్టుకునేలా కథ, కథానాలను తీర్చిదిద్దిన ఈ చిత్రం ఆగస్టు 13న విడుదల కానుంది.
'పాగల్' ప్రేమకథతో విష్వక్‌సేన్
విభిన్న కథలతో చిత్ర పరిశ్రమను పలకరించాడు యువ నటుడు విష్వక్‌సేన్. ఆయన కథానాయకుడిగా నరేశ్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'పాగల్'. నివేదా పేతురాజ్ కథానాయిక. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 14న 'పాగల్' విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. బెక్కెం వేణు గోపాల్ నిర్మాత. దిల్‌రాజు సమర్పిస్తున్నారు. సిమ్రాన్‌చౌదరి, మేఘాలేఖతో పాటు రాహుల్ రామకృష్ణ, మురళీశర్మ తదితరులు నటించారు. ఈ చిత్రానికి రధన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.
ఓటీటీలో రాబోతున్న చిత్రాలివే!
ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో ఇంకా పూర్తిగా థియేటర్లు తెరుచుకోని నేపథ్యంలో అనేక చిత్రాలు ఓటీటీ బాటపట్టాయి. ఈ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు చిత్రాలు, ముఖ్యంగా దేశభక్తి నేపథ్యంలోని చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
కార్గిల్ యుద్ధం నేపథ్యంలో 'షేర్షా'