ముంబయిలోని సినీ ప్రముఖులపై ఆదాయపన్ను శాఖ అధికారులు రైడ్ చేశారు. ఇందులో భాగంగా బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ, దర్శకుడు అనురాగ్ కశ్యప్, నిర్మాతలు మధు మంతెన, వికాస్ భల్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సీఈఓ సిభాషిస్ సర్కార్‌కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ విషయాన్ని ఓ ఆదాయపన్ను శాఖాధికారి తెలిపారు.
హీరోయిన్ తాప్సీ, దర్శకుడు అనురాగ్‌లపై ఐటీ దాడులు - tapsee latest news
![హీరోయిన్ తాప్సీ, దర్శకుడు అనురాగ్‌లపై ఐటీ దాడులు Income Tax raids on director Anurag Kashyap and actor Taapsee Pannu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10851231-654-10851231-1614758240524.jpg)
12:51 March 03
2018లో పన్ను ఎగవేసిన ఫాంటమ్ ఫిల్మ్స్‌తో పాటు దానితో సంబంధమున్న వారి ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహించినట్లు వెల్లడించారు. వీరి ఖాతాల నుంచి కొన్ని అనుమానాస్పద ఆర్థిక బదిలీలు జరిగాయన్న అనుమానంతో పాటు ఈ కేసులో భాగంగా మరిన్ని సాక్ష్యాలు సేకరించేందుకు ఈ సోదాలు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఫాంటమ్ ఫిల్మ్స్.. నిర్మాణ, సినిమాల పంపిణీ సంస్థ. అనురాగ్ కశ్యప్, దర్శకుడు విక్రమాదిత్య మోత్వాని, నిర్మాత మధు మంతెన, వికాస్ భల్ కలిసి 2011లో దీనిని స్థాపించారు. అయితే 2018లో వికాస్‌పై అత్యాచార ఆరోపణలు రావడం వల్ల సదరు సంస్థను మూసివేశారు.