తెలంగాణ

telangana

ETV Bharat / sitara

in the name of god: థ్రిల్లింగ్​గా టీజర్ - ప్రియదర్శి ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్

ప్రియదర్శి, నందిని రాయ్ ప్రధానపాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్​ 'ఇన్​ ది నేమ్ ఆఫ్ గాడ్' (in the name of god aha). తాజాగా ఈ సిరీస్ టీజర్​ను విడుదల చేశారు.

ING
ఇన్​ ది నేమ్ ఆఫ్ గాడ్

By

Published : May 29, 2021, 8:10 AM IST

ప్రియ‌ద‌ర్శి, నందిని రాయ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌' (in the name of god aha) అనే వెబ్ సిరీస్ తెర‌కెక్కుతోంది. విద్యాసాగ‌ర్ ముత్తుకుమార్ దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాజాగా టీజ‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్రబృందం.

"ఈ ఉడత‌ని ఎలా ప‌ట్టుకుంటారో తెలుసా? ఒక చెట్టుకి చిన్న తొర్ర చేసి అందులో దానికి ఆహారం వేస్తారు. ఉడ‌త అందులో త‌ల దూరుస్తుంది. తిరిగి బ‌య‌ట‌కు రాలేదు. అప్పుడు దాన్ని ఈజీగా బ‌య‌ట‌కు తీస్తారు" అంటూ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు చెప్పిన వాయిస్ ఓవ‌ర్‌తో ప్రారంభ‌మయ్యే ఈ టీజ‌ర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది.

ప్రియ‌ద‌ర్శి ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించని పాత్ర‌లో ద‌ర్శ‌న‌మిచ్చి ఆక‌ట్టుకుంటున్నాడు. ప్రియ‌ద‌ర్శితో పాటు ప్ర‌తి పాత్ర హ‌త్య‌కు పాల్ప‌డుతుంది. అలా ఎందుకు జరిగింది? అస‌లు దానికి కార‌ణం ఎవ‌రు? త‌దిత‌ర ప్ర‌శ్న‌ల‌న్నింటికీ స‌మాధానాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. క్రైమ్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో సురేశ్ కృష్ణ సంస్థ నిర్మిస్తోన్న ఈ సిరీస్ ఆహా ఓటీటీలో త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.

ABOUT THE AUTHOR

...view details