దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్ ఘటన నేపథ్యంలో బాలీవుడ్ కథానాయిక అనుష్క శర్మ సమాజం తీరును ఉద్దేశిస్తూ పోస్ట్ చేసింది. మగ శిశువు జన్మిస్తే దాన్ని గొప్పగా, విశేషంగా భావిస్తుంటారని.. అది సరికాదని సూచించింది.
"మగశిశువు పుడితే, దాన్ని ప్రత్యేక గుర్తింపుగా భావిస్తుంటారు. వాస్తవానికి, ఆడశిశువు పుట్టడం కంటే అది గొప్ప విషయం కాదు. మగబిడ్డ పుట్టడం అదృష్టంగా భావిస్తున్న తల్లిదండ్రులు దూరదృష్టితో ఆలోచించాలి. అమ్మాయిల్ని గౌరవించే విధంగా ఓ అబ్బాయిని పెంచినప్పుడు దాన్ని గొప్పగా భావించాలి. సమాజ శ్రేయస్సు కోసం తల్లిదండ్రులుగా అది మీ బాధ్యత. కాబట్టి వారి పుట్టుకే.. ఓ విశేషంలా భావించొద్దు. శిశువు లింగం మిమ్మల్ని గొప్ప వారిని చేయదు. సమాజంలో జీవించడాన్ని మహిళలు సురక్షితంగా, క్షేమంగా భావించాలి.. ఆ విధంగా కుమారుల్ని పెంచడం మీ బాధ్యత."