ఈ ఏడాది డిసెంబరులో రజనీకాంత్ అభిమానులు రెండు పండగలు జరుపుకోబోతున్నారు. వాళ్లకు మాత్రమే ఉన్న ఆ పండగలేంటి అని ఆలోచిస్తున్నారా? ఒకటి అందరికీ తెలిసిందే. అదే రజనీ పుట్టిన రోజు. డిసెంబరు 12 ఆయన అభిమానులకు పండగే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి ముందే ఆయన అభిమానులు మరొక ఉత్సవం జరుపుకోబోతున్నారని కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఆ రెండో పండగ ఏంటంటే.. ‘దర్బార్’ చిత్ర ముందస్తు విడుదల కార్యక్రమం.
తలైవా అభిమానులకు ఒకే నెలలో రెండు పండగలు - రజినికాంత్ తర్వాతి సినిమా
రజినీకాంత్ అభిమానులకు డిసెంబరు నెలలో రెండు పండగలు రాబోతున్నాయి. ఒకటి ఆయన పుట్టిన రోజు కాగా.. రెండోది తలైవా 'దర్బార్' సినిమా ముందస్తు విడుదల కార్యక్రమం అదే నెలలో జరగనుంది.
తలైవా అభిమానులకు ఒకే నెలలో రెండు పండుగలు
రజనీ నటించిన చిత్రాల విషయంలో ఏ కార్యక్రమమైనా ఆయన అభిమానులకు పండగే కదా! రజనీ పుట్టిన రోజు కంటే 5 రోజుల ముందు డిసెంబరు 7న ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ మేరకు సన్నాహాలు జరుగుతున్నాయని సినీ వర్గాల టాక్. అధిక సంఖ్యలో సినీ ప్రముఖులు హాజరవుతారని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కథానాయికగా నయనతార నటిస్తోంది.
ఇదీ చూడండి:ముంబయిలో అదిరిన హాలీవుడ్ గాయనుల సందడి
Last Updated : Nov 18, 2019, 10:47 AM IST