కరోనా సంక్షోభంతో దేశవిదేశాల్లో చిక్కుకున్న ఎందరినో ఇళ్లకు చేర్చి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్ పుట్టినరోజు నేడు. నేటితో 47 ఏళ్లు నిండి 48వ వసంతంలో అడుగుపెట్టిన ఆయన తన పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు.
గతేడాది లాక్డౌన్ సమయంలో వేలాది మంది వలసదారులు ఇళ్లకు చేరుకునేందుకు సోనూ తోడ్పాటును అందించారు. అంతేగాక ఆపత్కాలంలో ఉన్నవారికి తాను ఉన్నాననే భరోసా కల్పించారు. ఈ ఏడాదీ రెండోదశ విజృంభణ వేళ.. ప్రాణవాయువు కొరత ఏర్పడిన సందర్భంలోనూ సోనూ స్పందించారు. ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పి తన ఉదారతను చాటుకున్నారు.