జీతూ జోసెఫ్ దర్శకత్వంలో కార్తి నటిస్తున్న తమిళ చిత్రం 'తంబి'. తెలుగులో 'దొంగ'గా విడుదలకాబోతుంది. నటుడు సూర్య భార్య, నటి జ్యోతిక ఈ చిత్రంలో నటిస్తుండటం వల్ల అందరిలో ఆసక్తి పెరిగింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి సెకండ్ లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో కార్తి, జ్యోతిక, సత్యరాజ్ సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు.
ఆసక్తి కలిగిస్తోన్న 'దొంగ' సెకండ్ లుక్ - kaarthi, jyothika
కార్తి, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తమిళ చిత్రం 'తంబి'. తెలుగులో 'దొంగ'గా రాబోతున్న ఈ సినిమా సెకండ్ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
జ్యోతిక
జ్యోతిక కుడి కన్ను ఒక వైపు, కార్తి ఎడమ కన్ను మరోవైపు కనిపించేలా డిజైన్ చేసిన పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అంతేకాదు విడుదలైన కొద్ది సమయంలోనే ట్విట్టర్‌లో వైరల్గా మారింది. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుని డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. ఇప్పటికే విడుదలైన టీజర్ అభిమానుల్లో అంచనాలు పెంచుతోంది.
ఇవీ చూడండి.. మెగాస్టార్ అతిథిగా 'అర్జున్ సురవరం' ప్రీరిలీజ్ ఫంక్షన్
Last Updated : Nov 23, 2019, 10:53 PM IST