తొలి ప్రేమ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ మాట చాలామంది అంటారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా అడ్వాణీ కూడా ఇదే మాట చెప్పింది. పాఠశాలలో చదువుకునే రోజుల్లో తాను ప్రేమలో పడినట్లు తెలిపింది. కానీ ఆ వయసులో చదువు మీద దృష్టి పెట్టాలి.. ప్రేమ సరికాదంటూ తల్లిదండ్రులు మందలించడం వల్ల ఆ ప్రేమకు అప్పుడే స్వస్తి పలికినట్లు చెప్పింది. "ఫస్ట్ లవ్‌ను అంత సులువుగా మరచిపోలేం. ఎప్పుడు తలుచుకున్నా మధురంగానే ఉంటుంది. చిన్నప్పుడు ఒకరి మీద ఏర్పడ్డ ప్రేమ అలానే ఉండిపోతుంది" అని చెప్పింది కియారా.
'తొలి ప్రేమను మర్చిపోవడం చాలా కష్టం' - కియారా తొలి ప్రేమ
స్కూల్‌డేస్‌లో తాను ప్రేమలో పడినట్లు తెలిపిన హీరోయిన్ కియారా అడ్వాణీ.. తొలి ప్రేమ అనుభూతిని మర్చిపోవడం అంత సులువు కాదని చెప్పింది. తన తల్లిదండ్రులు మందలించడం వల్ల ఆ ప్రేమకు అప్పుడే గుడ్‌బై చెప్పినట్లు తెలిపింది.
కియారా
కాగా, హృతిక్ రోషన్ హీరోగా రూపొందనున్న 'క్రిష్ 4' లో ఇద్దరు కథానాయికల్లో ఓ నాయికగా నటించే అవకాశం కియారాకు దక్కిందని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇదీ చూడండి :గ్లామర్ రాణి.. కియారా అడ్వాణీ!