తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రాజకీయ అరంగేట్రంపై కంగనా ఆసక్తికర సమాధానం - kangana hritik clash

కావేరి పరిరక్షణ ఉద్యమంలో భాగంగా కోయంబత్తూర్ వెళ్లిన హీరోయిన్ కంగనా రనౌత్.. తన రాజకీయ అరంగేట్రంతోపాటు జయలలిత బయోపిక్​ 'తలైవి' గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

హీరోయిన్ కంగనా రనౌత్

By

Published : Oct 11, 2019, 1:46 PM IST

ఇషా ఫౌండేషన్​ నర్సరీలో హీరోయిన్ కంగనా రనౌత్

తన రాజకీయ అరంగేట్రంపై వస్తున్న వార్తలపై స్పందించింది బాలీవుడ్ నటి కంగనా రనౌత్. కావేరి పరిరక్షణ ఉద్యమంలో భాగంగా కోయంబత్తూర్​లోని ఇషా ఫౌండేషన్​కు వెళ్లిన ఈ నటి... అక్కడి నర్సరీలో మొక్కలు నాటింది. అనంతరం పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

"నేను ప్రస్తుతం 'తలైవి' సినిమాలో మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్ర పోషిస్తున్నాను. కావేరి ఉద్యమంలో భాగం కావడం, ఈ సినిమాలో నటిస్తుండటం వల్ల తమిళనాడుతో నా అనుబంధం బలపడుతోంది. జయలలితకు, నాకు సారుప్యతలు ఉన్నాయి. మేమిద్దరం ఒకేలా కష్టాలను ఎదుర్కొని జీవితంలో పైకొచ్చాం. అయితే రాజకీయాల్లో చేరేందుకు నాకు ఆసక్తి లేదు" -కంగనా రనౌత్, బాలీవుడ్ నటి

'తలైవి' సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉందని, ప్రస్తుతం తమిళంతో పాటు భరతనాట్యం నేర్చుకుంటున్నాని చెప్పింది కంగనా. ఈ చిత్రం కోసం శాయశక్తులా కృషి చేస్తున్నాని వెల్లడించింది.

ఇషా ఫౌండేషన్​ నర్సరీలో హీరోయిన్ కంగనా రనౌత్

అదే విధంగా రైతులందరూ కావేరి ఉద్యమంలో భాగం కావాలని చెప్పింది కంగనా. వ్యవసాయ రంగానికి మద్దతిచ్చేందు ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కనైనా నాటాలని తెలిపింది.

ఇది చదవండి: తొలిసారి స్క్రీన్​పై వేరొకరి పాత్ర పోషిస్తున్నాను: కంగనా రనౌత్

ABOUT THE AUTHOR

...view details