తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'డ్రగ్స్​ కాదు..ధూమపానం అలవాటు కూడా లేదు' - రకుల్​ ప్రీత్​ డ్రగ్ కేసు

సుశాంత్ రాజ్​పుత్ డ్రగ్స్ కేసు విచారణలో తనపై వస్తున్న మీడియా కథనాలను నిలిపేయాలని ఇటీవలే నటి రకుల్​ ప్రీత్​ సింగ్​ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. మీడియాను అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై అక్టోబరు 15లోపు స్టేటస్​ రిపోర్టు దాఖలు చేయాలని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖను ఆదేశించింది.

Rakul
రకుల్​ ప్రీత్​

By

Published : Sep 29, 2020, 6:47 PM IST

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి కేసు విచారణలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌‌ కేసుకు సంబంధించి.. మీడియా తన పేరును ప్రస్తావించకూడదని కథానాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఇటీవలే దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. మీడియాను అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై అక్టోబరు 15 లోగా స్టేటస్​ రిపోర్ట్​ దాఖలు చేయాలని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖను ఆదేశించింది.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ విచారణకు రకుల్​ ప్రీత్​ తరఫున న్యాయవాది అమన్​ హింగోరాని హాజరయ్యారు. కేసు దర్యాప్తు దశలో ఉన్నప్పుడు సంబంధిత వ్యక్తిపై వచ్చే కథనాలను ఆపేందుకు హైకోర్టుకు ఆధికారాలు ఉన్నాయని పేర్కొన్నారు. తన క్లయింట్​ను ఓ కేసులో సాక్షిగా పిలిచారని.. ఈ క్రమంలోనే తను డ్రగ్స్​ తీసుకున్నట్లు అనేక అసత్య వార్తలు వస్తున్నాయని అన్నారు. రకుల్​కు ధూమపానం అలవాటు కూడా లేదని ఆమె తరఫున నివేదిక సమర్పించారు.

కాగా మంత్రిత్వ శాఖ తరఫున హాజరైన అదనపు​ సొలిసిటర్​ జనరల్ చేతన్​ శర్మ మాట్లాడుతూ.. రకుల్​ ఫిర్యాదును పరిష్కరించే పనిలోనే ఉన్నట్లు కోర్టుకు తెలిపారు.

రకుల్​ పిటిషన్​పై స్పందించాలని సెప్టెంబరు 17న దిల్లీ హై కోర్టు.. కేంద్రం, మీడియా నియంత్రణ సంస్థలను ఆదేశించింది. ఈ క్రమంలోనే సెప్టెంబరు 26న మరోసారి కోర్డును ఆశ్రయించిన రకుల్​.. తనపై వస్తున్న కథనాలను ప్రచురించకుండా.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది. ఈ నేపథ్యంలో రకుల్‌ పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం, మీడియా నియంత్రణ సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details