యువ కథానాయకుడు అడివి శేష్(Adivi Sesh).. ఓ బాలీవుడ్ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నట్లు ఇటీవలే కొన్ని వార్తలు వచ్చాయి. అయితే వీటిపై ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించిన శేష్.. నిజంగానే తాను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు కుండబద్ధలు కొట్టాడు. అయితే ప్రస్తుతం తామిద్దరూ పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశాడు. వరుస చిత్రాల్లో నటిస్తున్న నేపథ్యంలో నిద్రపోయేందుకు కూడా సమయం దొరకడం లేదని చెప్పాడు.
అయితే అడివి శేష్ ప్రేమించే అమ్మాయి పేరు చెప్పేందుకు నిరాకరించాడు. కానీ, తాను ప్రేమించిన అమ్మాయిది హైదరాబాద్ అని మాత్రం చెప్పాడు. ఇక అంతకుమించి తన ప్రేమ వ్యవహరాన్ని బయటపెట్టలేనని అన్నాడు.