తెలంగాణ

telangana

ETV Bharat / sitara

డిప్రెషన్​తో బాధపడుతున్న ఆమిర్ ఖాన్ కుమార్తె!

మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు చెప్పిన ఆమిర్ కుమార్తె ఐరా ఖాన్.. కొన్నేళ్ల నుంచి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. దీనితో పాటే పలు విషయాలను వెల్లడించింది.

'I'm clinically depressed,' confesses Aamir Khan's daughter Ira Khan
ఆమిర్ కుమార్తె ఐరా ఖాన్

By

Published : Oct 11, 2020, 2:13 PM IST

బాలీవుడ్ సూపర్​స్టార్ ఆమిర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్, డిప్రెషన్​తో బాధపడుతున్నట్లు చెప్పింది. 'వరల్డ్ మెంటల్ హెల్త్ డే' సందర్భంగా శనివారం ఓ వీడియోను పోస్ట్ చేసింది. మానసిక ఆరోగ్యం గురించి ఫాలోవర్లతో మాట్లాడింది.

"హాయ్, నేను డిప్రెషన్​కు గురయ్యాను. ఇది నాలుగేళ్ల నుంచి సాగుతోంది. వైద్యుడి సలహాలు తరచుగా తీసుకుంటున్నాను. ప్రస్తుతం బాగానే ఉన్నాను. ఏడాది నుంచి మానసిక ఆరోగ్యం కోసం ఏదో చేయాలని అనుకుంటున్నాను. కానీ ఏం చేయాలో తెలియట్లేదు. ప్రపంచంలో చాలా విషయాలు జరుగుతున్నాయి. ఎంతోమంది తమ మనసులోని విషయాల్ని చెప్పాలనుకుంటున్నారు. ఆ విషయాలన్నీ నిజంగా గందరగోళంగా, ఒత్తిడితో ఉన్నాయి. అయితే వీటన్నింటిని పరిష్కారంగా కనుగొన్నాను. అందులో భాగంగా మనమంతా మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడుదాం" -ఇన్​స్టాలో ఐరా ఖాన్ వీడియో

గత కొంతకాలంగా పలురకాల పనులు చేస్తూ బిజీగా ఉంది ఐరా. లాక్​డౌన్​లో టాటూ ఆర్టిస్ట్​గా మారింది. అందుకు సంబంధించిన కొన్ని వీడియోలను ఇన్​స్టాలో పంచుకుంది.

ABOUT THE AUTHOR

...view details