ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలతో సినిమా షూటింగ్‌ల నుంచి తాత్కాలికంగా విరామం తీసుకున్న సంజయ్‌దత్ త్వరలో మేకప్ వేసుకోనున్నారు. ఈ మధ్యనే హెయిర్‌కట్ కోసం ఆయన సెలబ్రిటీ హెయిర్‌స్టైలిస్ట్ అయిన అలీం హకీం సెలూన్‌కు వెళ్లారు. సంజయ్ దత్ ఉన్న ఒక వీడియోను అలీం హకీం షేర్ చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
"హాయ్. నేను సంజయ్‌దత్. హెయిర్‌కట్ చేయించుకున్నాను. సెలూన్‌కు రావడం నాకు సంతోషంగా ఉంది. క్యాన్సర్ కారణంగా నా జీవితం కుదుపునకు లోనైంది. కానీ, నేను దానితో పోరాడి తప్పకుండా విజయం సాధిస్తాను. ‘కేజీఎఫ్2’లోని పాత్ర కోసం నేను జుట్టు కత్తిరించుకున్నాను. నవంబర్‌లో జరిగే షూటింగ్‌లో పాల్గొంటా. సినిమా సెట్లోకి అడుగు పెట్టబోతుండటంతో నాకు సంతోషంగా ఉంది. రేపు ‘షంషేర్’ చిత్రంలోని నా పాత్రకు డబ్బింగ్ చెప్పబోతున్నాను "