ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్.. తొలిసారి దాని గురించి మాట్లాడారు. త్వరలోనే ఈ వ్యాధిని జయిస్తానని అన్నారు.
క్యాన్సర్‌ను త్వరలోనే జయిస్తా: సంజయ్ దత్ - Sanjay Dutt latest news
తనకొచ్చిన క్యాన్సర్‌ను త్వరలో జయిస్తానని ధీమా వ్యక్తం చేశారు ప్రముఖ నటుడు సంజయ్ దత్. నవంబరు నుంచి సినిమా షూటింగ్‌ల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.
క్యాన్సర్‌ను త్వరలో జయిస్తా: సంజయ్ దత్
ఆగస్టులో తనకు క్యాన్సర్ సోకినట్లు చెప్పిన సంజయ్.. చికిత్స కోసం కొన్నాళ్లు నటనకు విరామం తీసుకుని విదేశాలకు వెళ్లొస్తానని అన్నారు. అనంతరం ఇటీవలే తిరిగొచ్చారు. ఈ క్రమంలో క్యాన్సర్ గురించి వెల్లడించారు.
ఈ మధ్యే 'సడక్ 2'తో అభిమానుల ముందుకొచ్చిన సంజయ్.. యశ్ 'కేజీఎఫ్ 2', రణ్‌బీర్ కపూర్ 'సంషేరా'లో నటిస్తున్నారు. వచ్చే నెల నుంచి షూటింగ్‌లోనూ పాల్గొనున్నారు. ఆయనే ఈ విషయాన్ని తెలిపారు.